- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన నటుడు బండ్ల గణేష్ కొడుకు.. కారణం ఇదే!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కుమారుడు హిరేష్ పోలీసును ఆశ్రయించారు. ఈడీ జప్తులో ఉన్న ఇంటిని మోసపూరితంగా తనకు విక్రయించే ప్రయత్నం చేశారని హీరా గ్రూపు చైర్ పర్సన్ నౌహీరా షేక్, ఆమె పది మంది అనుచరులపై హైదరాబాద్‌లోని ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. రూ.3 కోట్ల వరకు తన వద్ద డబ్బు తీసుకొని ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా, ఇటీవల పది మంది అనుచరులతో ఇంటి వద్దకు వచ్చిన ఆమె.. ఖాళీ చేయాలని తీవ్ర ఒత్తిడి చేసిందని.. తాను నిరాకరించడంతో అసభ్య పదజాలంతో దూషించిందని అన్నారు. కాగా, హీరా గోల్డ్ కుంభకోణం(రూ.5 వేల కోట్లు)పై మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నౌహిరాకు చెందిన భూముల్ని, ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. అయితే, ఈడీ జప్తులో ఉన్న ఇంటికి బండ్ల హిరేష్‌కు విక్రయించి.. అసలు విషయం బయటపడటంతో బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన చెందారు.