CM Revanth Reddy: గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు

by Gantepaka Srikanth |
CM Revanth Reddy: గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ రేసు(Formula E Race) స్కామ్‌లో గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఓ మీడియా ఛానల్‌తో ఆయన మాట్లాడారు. వికారాబాద్ కలెక్టర్‌పై దాడి ఘటన(Vikarabad Incident)పైనా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందించారు. కలెక్టర్‌పై దాడి చేసిన వారిని.. ఆ దాడికి ఉసిగొల్పిన వారిని వదిలిపెట్టం అని వార్నింగ్ ఇచ్చారు. ఎంతటి వారైనా ఊచలు లెక్కపెట్టాల్సిందే అని కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులను చంపాలని చూస్తున్న వారిని బీఆర్ఎస్(BRS) ఎలా సమర్థిస్తుందని మండిపడ్డారు. అంతేకాదు.. అమృత్ టెండర్ల(Amrit Tenders)పై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు.

అభ్యంతరాలు ఉంటే లీగల్‌గా ఫైట్ చేయండి అని సూచించారు. సృజన్ రెడ్డి బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేకి మేనల్లుడు అని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలోనే సృజన్ రెడ్డికి వేల కోట్ల కాంట్రాక్టులు వచ్చాయని అన్నారు. రెడ్డి పేరున్న వారంతా నా బంధువులు కాదని తెలిపారు. ఫార్ములా ఈ రేసు స్కామ్‌లో గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు ఉంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. విచారణ నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారని విమర్శించారు. ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ రేసు పేరుతో రూ.55 కోట్లను విదేశాలకు తరలించిన కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించేందుకు అనుమతి కావాలని గవర్నర్‌కు ఏసీబీ లేఖ రాసిన విషయం తెలిసిందే. గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వం, ఏసీబీ ఎదురుచూస్తోంది.

Advertisement

Next Story

Most Viewed