Accident : PV నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌ హైవేపై రెండు కార్లు ఢీ..పలువురికి గాయాలు.. !

by Maddikunta Saikiran |
Accident : PV నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌ హైవేపై రెండు కార్లు ఢీ..పలువురికి గాయాలు.. !
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ లో ఈ రోజు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ వద్ద పీవీ నరసింహారావు (PVNR ) ఎక్స్‌ప్రెస్‌ హైవేపై కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న మరో కారును ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కాగా.. ఈ రోజు మధ్యాహ్న సమయంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మెహదీపట్నం వైపు వెళ్తున్న కారు డ్రైవర్ స్టీరింగ్‌పై అదుపు తప్పి పిల్లర్ నెం.294 సమీపంలో ముందు వెళ్తున్న మరో కారును ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు దీంతో కారు అదుపుతప్పి కొన్ని మీటర్ల దూరంలో నిలిచిపోయింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో రెండు కార్లు భారీగా దెబ్బతిన్నాయని, కార్లు ఢీకొనడంతో ఎక్స్‌ప్రెస్‌ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యిందని పోలీసులు తెలిపారు.రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Next Story

Most Viewed