నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ.. దరఖాస్తు ఎలా నింపాలో పూర్తి వీడియో

by GSrikanth |
నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ.. దరఖాస్తు ఎలా నింపాలో పూర్తి వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రోగ్రామ్‌ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. గురువారం ఉదయం నుంచే అన్ని గ్రామాల్లో అధికారులు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇప్పటికే ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలోని మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు, 3,626 మున్సిపల్ వార్డులు, డివిజన్లతో కలిపి మొత్తం 16,395 చోట్ల ప్రజాపాలన ప్రోగ్రామ్ డిసెంబరు 28న ప్రారంభమై జనవరి 6వ తేదీ వరకు కొనసాగనున్నది.

ఇందుకోసం మొత్తం 3,714 టీమ్‌లు ఏర్పాటయ్యాయి. ప్రతీ వంద మంది ప్రజలకు ఒక కౌంటర్ చొప్పున తొలుత అనుకున్నట్లుగానే ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా కలెక్టర్లను ఆమె ఆదేశించారు. అయితే, కొందరికి దరఖాస్తు ఫిల్ చేసే క్రమంలో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎలాంటి అనుమానాలు లేకుండా దరఖాస్తును ఎలా నింపాలో కింది వీడియోలో తెలుసుకుందాం.

Advertisement

Next Story

Most Viewed