గొర్రెల కుంభకోణంలో రెండో రోజు ఏసీబీ విచారణ.. రాజకీయ నాయకుల పాత్రపై నజర్

by Prasad Jukanti |
గొర్రెల కుంభకోణంలో రెండో రోజు ఏసీబీ విచారణ.. రాజకీయ నాయకుల పాత్రపై నజర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ విచారణ వేగవంతం చేసింది. పశుసంవర్ధక శాఖ మాజీ ఎండీ రామ్ చందర్ నాయక్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ కల్యాణ్ ను ఏసీబీ అధికారులు కస్టడిలో రెండో రోజు విచారిస్తున్నారు. మంగళవారం ఏసీబీ హెడ్ ఆఫీస్ లో వీరిని దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తున్నారు. గొర్రెల పంపిణీ పథకం యూనిట్‌ కాస్ట్‌ పెంపు, దళారుల ప్రమేయంపై విచారణ చేపట్టారు. రెండో రోజు కస్టడీలో రాజకీయ నాయకుల పాత్రపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అలాగే కల్యాణ్‌ ఫైల్స్‌ తరలింపు, కాల్చివేతపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కాగా గొర్రెల స్కామ్ కేసులో కీలక నిందితులుగా ఉన్న రాంచందర్, కల్యాణ్ లను మూడు రోజుల పాటు కస్టడిలోకి తీసుకున్న ఏసీబీ.. మొదటి రోజు విచారణలో గొర్రెల యూనిట్స్ పంపిణీలో అవకతవకలపై ఆరా తీసింది. రెండో రోజు విచారణలో రాజకీయ నాయకుల పాత్రపై దృష్టి సారించడంతో నిందితులు చెప్పే సమాచారంతో ఈ కేసులో ఎలాంటి ట్విస్టులు నమోదు కాబోతున్నాయనేది ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story

Most Viewed