- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సీఎం పదవి కన్నా పెద్ద స్టేచర్ ఏముంటుంది.. బీఆర్ఎస్‌కు విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) చేసిన స్టేచర్ పాలిటిక్స్ (Stature Politics) కామెంట్స్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) ఫైర్ అయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ సీఎం పదవి నిర్వహించే స్టేచర్ గురించి సభ దృష్టి తీసుకొచ్చారు. కొంతమంది రేవంత్ స్టేచర్ ఏంటని మాట్లాడుతున్నారని.. సీఎం కంటే పెద్ద పదవి ఏముంటుందని ప్రశ్నించారు. స్టేచర్ అనేది ప్రజలు ఇవ్వాలని.. అది రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రజలు ఎన్నడో ఇచ్చాని హితవు పలికారు. అదేవిధంగా కమీషన్ అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్‌పై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కమీషన్ కాకతీయ (Commission Kakatiya), కమీషన్ భగీరథ (Commission Bhagiratha)లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమలపై విమర్శలు గుప్పించారు. నలుగురి వల్ల రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్లు అప్పు అయిందని కామెంట్ చేశారు. రాష్ట్రానికి కేసీఆర్ ఆర్థికంగా క్యాన్సర్‌ను ఇచ్చారని.. ఆ క్యాన్సర్ రోజురోజుకు బలపడుతుంటే తెలంగాణ ఆర్థికంగా కుదేలైందని ఆది శ్రీనివాస్ ఆరోపించారు.
Read More..
Raja Singh: సీఎంతో రహస్యంగా భేటీ అవుతుండ్రు.. సొంత పార్టీ నేతలపై రాజాసింగ్ సెన్సేషనల్ కామెంట్స్