Aadi Srinivas: బీఆర్ఎస్ అనే సినిమాకు ఎండ్ కార్ట్ పడినట్లే.. విప్ ఆది శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-12-02 09:06:58.0  )
Aadi Srinivas: బీఆర్ఎస్ అనే సినిమాకు ఎండ్ కార్ట్ పడినట్లే.. విప్ ఆది శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌‌డెస్క్: నేతన్నల జీవితాలతో ఆటలాడింది బీఆర్ఎస్ (BRS) పార్టీయేనని ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) ఆరోపించారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌ (Hyderabad)లోని గాంధీ భవన్‌ (Gandhi Bhavan)లో మీడియాతో మాట్లాడుతూ.. బతుకమ్మ చీరల (Bathukamma Sarees) పేరుతో సూరత్ (Surat) నుంచి చీరలు తెప్పించి రాష్ట్రంలోని నేతన్నల జీవితాలను ఆగం చేశారని ఫైర్ అయ్యారు. బతకమ్మ చీరలు మహిళలు కట్టుకోవడానికి పనికి రాకపోతే పంట చేలకు రక్షణగా రైతులు వాడారని గుర్తు చేశారు. కేబినెట్‌ (Cabinet)లో మహిళలకు స్థానం కల్పించని చరిత్ర గులాబీ పార్టీదేనని ధ్వజమెత్తారు. బతుకమ్మ చీరలను అసలు మహిళలు ఆనందంగా కట్టుకున్నారా అని ప్రశ్నించారు.

పదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించినా ఒక్క డీఎస్పీ (DSC) కూడా వేయని ఘన చరిత్ర బీఆర్ఎస్ (BRS) సర్కారుదేనంటూ సెటైర్లు వేశారు. ఆనాడు సకల జనుల సర్వే చేయించి నివేదికలను అటకెక్కించిన ఘనత ఆ మహానుభావులకే చెందిందని అన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ (BRS Party).. బీసీ (BC)లకు అనుకూలమా.. కాదా చెప్పాలని డిమాండ్ చేశారు. జనాభా దామాషా పద్ధతితో అన్ని వర్గాల వారికి సమానంగా సంక్షేమ ఫలాలు దక్కాలని తెలిపారు. అందుకే తమ ప్రభుత్వం సమగ్ర సర్వేకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. నిరుద్యోగుల నోట్లో మట్టికొడుతూ.. గ్రూప్-1 (Group-1) పేపర్లను లీక్ చేశారని ఆక్షేపించారు. బీఆర్ఎస్ అనే సినిమాకు ముగింపు కార్టు పడిందని ఆది శ్రీనివాస్ దుయ్యబట్టారు.

Advertisement

Next Story

Most Viewed