- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Aadi Srinivas: లొట్టపీసు కేసా? ఇప్పుడు మాట్లాడు.. కేటీఆర్ పై ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్

దిశ, డైనమిక్ బ్యూరో: ఫార్ములా-ఈ కార్ రేసు అంశంలో (Formula - E Car Race) మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టులోనే కాదు సుప్రీంకోర్టు(Supreme Court) లోనూ చుక్కెదురైందని దీంతో అటు గోడ దెబ్బ ఇటు చెంపదెబ్బలా ఆయన పరిస్థితి మారిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) విమర్శించారు. తనపై లొట్టపీసు కేసు పెట్టారంటూ అనరాని మాటలతో రెచ్చిపోయిన కేటీఆర్ (KTR) దమ్ముంటే ఇప్పుడు మాట్లాడాలన్నారు. ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు. బుధవారం కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ కార్ రేసు అంశంలో నిబంధనలకు విరుద్ధంగా కేటీఆర్ ప్రజాధనాన్ని దుర్మినియోగం చేశారని దుయ్యబట్టారు. అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. అదే చేయాలంటే ఈ ప్రభుత్వం వచ్చి 13 నెలలు అయిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయంలో రేవంత్ రెడ్డిని అర్థరాత్రి తలుపులు బద్ధలు కొట్టి అరెస్ట్ చేశారని కానీ గుర్తు చేశారు.
గవర్నర్ అనుమతితో ఏసీబీ, ఆ తర్వాత ఈడీ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే లొట్టపీసు కేసు అంటూ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అధికారంలో ఉండగా మాట్లాడిన నలుగురే ఇప్పుడూ మాట్లాడుతున్నారని విమర్శించారు. మేడిగడ్డ, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల, చేపల కుంభకోణాలపై దర్యాప్తు జరుగుతోందన్నారు. కోర్టులకు వెళ్లి విచారణ ఆపాలని చూసినా నిజం నిప్పు లాంటిదన్నారు. మీరు చేసిన పొరపాటులతో దేవుడు కూడా మీ పక్షాన లేడన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం అంశంలో ఎక్కడా రాజీపడకుండా చట్టప్రకారం శిక్ష తప్పదని హెచ్చరించారు. అది ఎంత పెద్దవారైనా వదిలే ప్రసక్తే లేదన్నారు.