- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అమ్మాయిలను పంపాలని వేధిస్తున్నాడు’.. BRS ప్రజాప్రతినిధిపై సంచలన ఆరోపణలు చేసిన యువతి
దిశ, డైనమిక్ బ్యూరో: మరోసారి అధికారంలోకి వచ్చేందుకు గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ప్రణాళికలు రచిస్తుంటే.. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ నేతల వ్యవహారశైలి మాత్రం పార్టీ ప్రతిష్టను గంగపాలు చేసేలా మారుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనవసరమైన వివాదాల జోలికి వెళ్లవద్దని అధినేత హెచ్చరించినా.. కొంత మంది తమ తీరు మార్చుకోవడం లేదు. బాస్ ఆదేశాలు తమకు కాదు అన్నట్లుగా వ్యవహారిస్తూ లేనిపోని వివాదాలను నెత్తిన వేసుకుంటున్నారు. దీంతో మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న కేసీఆర్‌కు తాజా పరిణామాలు షాక్ ఇచ్చేలా మారుతున్నాయి.
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య మహిళా సర్పంచ్‌ను లైగికంగా వేధించాడనే ఆరోపణల ఎపిసోడ్ ఇలా ముగిసిందో లేదో.. తాజాగా మంచిర్యాల జిల్లాకు చెందిన మరో ప్రజాప్రతినిధి తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. ఆ ప్రజాప్రతినిధి తమను మోసం చేశాడని, తన వద్దకు అమ్మాయిలను పంపించి కోర్కెలు తీర్చాలని బెదిరిస్తున్నాడని ఆరిజిన్ డెయిరీ నిర్వాహకులు మంగళవారం ఆరోపించారు. బ్రోకర్ల ద్వారా హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్‌కే అమ్మాయిలను పంపించాలని తమపై ఒత్తిడి తీసుకువస్తున్నారని వాళ్లు ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్‌లు ఇవే అంటూ కొన్ని స్క్రీన్ షార్ట్‌లు, యువతుల ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం అధికారపార్టీని కలవరపాటుకు గురి చేస్తోంది.
పార్టీ పరువు మసకబారే:
అధినేత కేసీఆర్ ఎంత హెచ్చరించినా అధికార పార్టీ నేతల ఆగడాలకు ఫుల్ స్టాప్ పడటం లేదు. క్షేత్రస్థాయిలో నిత్యం ఎక్కడో చోట గులాబీ నేతలపై రకరకాల వేధింపుల ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. గతంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ మైనర్ బాలికపై అధికార పార్టీకి చెందిన నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్ ఖాన్ అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దాంతో అతడిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. ఇక పాల్వంచలో సాక్షాత్తు ఎమ్మెల్యే కుమారుడి వేధింపులకు ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇవి మచ్చుకు కొన్ని ఘటనలే అయినా ఇంకా అనేక దుర్మార్గాలలో అధికార పార్టీ నేతల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉండటం గులాబీ అధినేతకు టెన్షన్ పెట్టించే వ్యవహరంగా మారుతోంది.
ప్రతిపక్షాల చేతికి ఆయుధాలు:
ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు గతానికంటే పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కడుపుకట్టుకుని పని చేయాలని, వివాదాల్లోకి తల దూర్చవద్దని పార్టీ నేతలను అధినేత హెచ్చరించినా.. ఆ ఆదేశాలను కొంత మంది ఖాతరు చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది.
ప్రభుత్వ తీరుపై ఓ వైపు నిరుద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు రగిలిపోతున్న తరుణంలో ఎమ్మెల్యేల వరుస బాగోతాలు మహిళా లోకాన్ని పార్టీకి దూరం చేసేలా మారుతున్నాయనే చర్చ జరుగుతోంది. ఇకనైనా అధినేత పార్టీ నేతలను కంట్రోల్ చేయకపోతే ప్రతిపక్షాల చేతికి ఆయుధాలుగా మారే అవకాశం ఉందని ఫలితంగా ఈ పరిణామాలు వచ్చే ఎన్నికల్లో కారు పార్టీని మరింత ఇబ్బందులకు గురి చేస్తాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Read more: