- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లండన్‌లో తెలంగాణ యువతి దారుణ హత్య
X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లిన తెలంగాణ యువతి దారుణ హత్యకు గురయ్యింది. బ్రెజిల్‌కు చెందిన యువకుడు కత్తితో చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయింది. మరో యువతి తీవ్రంగా గాయపడింది. వివరాలు ఇలా ఉన్నాయి. హయత్ నగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన తేజస్విని పై చదువుల కోసం కొంతకాలం క్రితం లండన్ వెళ్లింది. స్నేహితులతో కలిసి ఉంటూ చదువుకుంటోంది.
కాగా, మంగళవారం సాయంత్రం బ్రెజిల్ దేశానికి చెందిన ఓ యువకుడు తేజస్వినితోపాటు మరో యువతి అఖిలపై కత్తితో దాడి చేసి విచక్షణారహితంగా పొడిచాడు. దాడిలో తేజస్విని అక్కడికక్కడే చనిపోయింది. తీవ్రంగా గాయపడ్డ అఖిల ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దాడి చేసిన యువకుని వివరాలు తెలియలేదు. తేజస్విని మరణించినట్టు లండన్ పోలీసుల నుంచి సమాచారం రావటంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Advertisement
Next Story