విషాదం.. అన్నా, తమ్ముళ్లకు రాఖీ కట్టి ప్రాణాలు వదిలిన యువతి

by Mahesh |   ( Updated:2024-08-19 15:52:39.0  )
విషాదం.. అన్నా, తమ్ముళ్లకు రాఖీ కట్టి ప్రాణాలు వదిలిన యువతి
X

దిశ, వెబ్ డెస్క్: కొన ఊపిరితో ఉన్న ఓ యువతి తన అన్న, తమ్ముళ్లకు రాఖీ కట్టి ప్రాణాలు విడిచింది. శనివారం రాత్రి చోటు చేసుకొగా నేడు వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలానికి చెందిన యువతి కోదాడలో డిప్లొమా చదువుతుంది. అయితే అదే కాలేజీకి చెందిన ఓ ఆకతాయి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇది గమనించి యువతిని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే పరిస్థితి విషమించడంతో కొన ఊపిరితో ఉన్న ఆ యువతి రక్షాబంధన్ వరకు బ్రతికి ఉంటానో.. లేదోనని.. శనివారం రాత్రి తమ్ముడు, అన్నలకు రాఖీ కట్టింది. అనంతరం కొద్ది గంటల్లోనే ఆ యువతి తుది శ్వాస విడిచింది. ఈ సంఘటన ప్రస్తుతం వైరల్ గా మారడంతో.. తన అన్న, తమ్ముళ్లపై యూవతికి ఉన్న ప్రేమను తలుచుకుంటు కన్నీరు పెడుతున్నారు.

Read More..

TGSRTC : రక్షాబంధన్ రోజు ఆర్టీసీ బస్సులో గర్భిణీకి పురుడు పోసిన కండక్టర్.. సజ్జనార్ ఆసక్తికర ట్వీట్

Advertisement

Next Story