బర్త్ డే పార్టీకి పిలిచి బంధువులను చితకొట్టిన యువకుడు

by Satheesh |   ( Updated:2023-02-14 04:30:41.0  )
బర్త్ డే పార్టీకి పిలిచి బంధువులను చితకొట్టిన యువకుడు
X

దిశ, వెబ్‌డెస్క్: మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. పార్టీకి బంధువులను ఇంటికి పిలిచి చితకొట్టాడు. వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా అత్వెల్లిలో నవీన్ అనే యువకుడు అతడి కొడుకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి పలువురు బంధువులను ఆహ్వనించాడు. ఇక్కడి వరకు బానే ఉండగా.. కొడుకు బర్త్ డే పార్టీ సందర్భంగా మద్యం సేవించిన నవీన్.. మత్తులో వీరంగం సృష్టించాడు. బర్త్ డే పార్టీకి వచ్చిన బంధువులను మత్తులో చితకొట్టాడు. మద్యం ఎక్కువైందని వారించిన బంధువులపై విచక్షణరహితంగా దాడి చేశాడు. అంతేకాకుండా ఇంట్లో నుండి ఎవరూ బయటికి వెళ్లకుండా తాళం వేసి నానా హంగామా సృష్టించాడు. స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇంట్లోని వారిని రక్షించారు.

Advertisement

Next Story