KCR: బీఆర్ఎస్‌లో చేరిన టాలీవుడ్ ప్రొడ్యూసర్.. ఆహ్వానించిన కేసీఆర్

by Gantepaka Srikanth |
KCR: బీఆర్ఎస్‌లో చేరిన టాలీవుడ్ ప్రొడ్యూసర్.. ఆహ్వానించిన కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రొడ్యూసర్, పరుపాటి శ్రీనివాస్ రెడ్డి(Parupati Srinivas Reddy), సినీ ఆర్టిస్ట్ రవితేజ(Raviteja) బీఆర్ఎస్‌లో చేశారు. వారికి ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్‌లో బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం పాలకుర్తి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్(KCR) మాట్లాడారు. ‘అన్ని జిల్లాల్లో జనం చెబుతున్నారు. మళ్ళీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. వచ్చే ఎన్నికల్లో 100 శాతం మనమే అధికారంలోకి వస్తాం.

అందులో అనుమానమే లేదు.. ప్రజలు ఏమి కోల్పోయారో ఈ 11 నెలల్లో వారికి అర్ధం అయ్యింది. అందరూ కష్టపడి పనిచేయాలి. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ఎలా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు. గత ఎన్నికల్లో మనం మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు 10 శాతమే.. కానీ 90 శాతం నెరవేర్చి చూపించాం. ప్రజలు అడగని హామీలు కూడా అమలు చేశాం’ అని కేసీఆర్ అన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed