టెన్త్ పేపర్ లీక్‌పై సమగ్ర విచారణ జరిపించాలి: విద్యార్థి సంఘాల డిమాండ్

by Satheesh |
టెన్త్ పేపర్ లీక్‌పై సమగ్ర విచారణ జరిపించాలి: విద్యార్థి సంఘాల డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వికారాబాద్ జిల్లా తాండూరులో 10వ తరగతి వార్షిక పరీక్షల ప్రశ్నాపత్రం వాట్సాప్ ద్వారా గ్రూప్‌ల్లో చక్కర్లు కొట్టడంపై సమగ్ర విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు సోమవారం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి ఆర్.ఎల్.మూర్తి, టి.నాగరాజు, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి.మహేష్, ఎస్పీ శ్రీకాంత్, వీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ అరున్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రశాంత్, వీరు నాయక్‌లు ఒక ప్రకటనలో తెలిపారు.

విద్యార్థులకు జీవితంలో ఉన్నత చదువులకు తొలి మెట్టు అయిన 10 వ తరగతి వార్షిక పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజీ కావడం అంటే పరీక్షల నిర్వహణ పట్ల విద్యాశాఖ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం చాలా పకడ్బందీగా నిర్వహించాలని, వరుస పేపర్ లీకేజీ లతో పరీక్షలపై విద్యార్థులు నమ్మకం కోల్పోతున్నారని పేర్కొన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, విద్యా శాఖ పరీక్షల నిర్వహణపై విద్యార్థులకు భరోసా కల్పించలన్నారు. పదో తరగతి వార్షిక ప్రశ్నపత్రం లీకేజీ పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story