- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘దిశ’ ఎఫెక్ట్: బిల్డాక్స్ సంస్థకు రూ.3.96 కోట్లు పెనాల్టీ
దిశ, తెలంగాణ బ్యూరో: ఎలాంటి అనుమతులు లేకుండా అమ్మకాలు సాగిస్తున్న బిల్డాక్స్ సంస్థకు షాక్ తగిలింది. బిల్డాక్స్ ప్రాజెక్టు విషయంలో ‘రెరా’ ట్రిబ్యునల్ గురువారం విచారణ జరిపింది. ఏకంగా రూ.3.96 కోట్ల పెనాల్టీని విధించింది. బిల్డాక్స్ జారీ చేసిన ప్రకటన ఫేస్ బుక్ లో ఇంకనూ (Live) లో కొనసాగుతున్నది. ఈ కారణంగా ప్రజలకు తప్పుడు సమాచారం చేరవేస్తూ సంబంధిత వ్యక్తుల నుంచి నగదు వసూళ్ళకు పాల్పడుతున్నట్లు రెరా గుర్తించింది. ‘రెరా’ చట్టంలోని సెక్షన్ 59, 60 రెడ్విత్ ప్రకారం భారీ మొత్తంలో అపరాధ రుసుముగా విధించినట్లు అథారిటీ తెలిపిది. బిల్డాక్స్ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయడానికి మూడు వారాల సమయం కావాలని కోరారు. ఐతే ఫేస్ బుక్ బిల్డాక్స్ ప్రాజెక్టు వారి ప్రకటన ఇంకా కొనసాగడాన్ని పరిగణలోకి తీసుకున్నారు. కొనుగోలుదారులు మోసాలకు గురికాకుండా వారిని అప్రమత్తం చేయడానికి బిల్డాక్స్ కు అపరాధ రుసుము విధించినట్లు రెరా ప్రకటించింది.
ఇదే ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి ప్రకటనలు, మార్కెటింగ్, విక్రయాలు కొనసాగించరాదని రెరా అథారిటీ బిల్డాక్సు కు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫేస్ బుక్ ప్రకటనలు వెంటనే తొలగించాలని రెరా ట్రిబ్యునల్ బిల్డాక్సుని ఆదేశించింది. ‘రెరా’ అనుమతులు లేని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టి, కొనుగోలు చేసి మోసపోరాదని కొనుగోలుదారులకు సూచించింది. కొనుగోలుదార్లకు భరోసా కల్పిస్తూ వారి రక్షణ కోసం రెరా అథారిటీ అన్ని చర్యలు తీసుకుంటుందని అథారిటీ తెలిపింది. ‘రెరా’ రిజిస్ట్రేషన్ పొందకుండా వ్యాపార ప్రకటనలు జారీ చేయడం, మార్కెటింగ్ కార్యకలాపాలు నిర్వహంచడం నిబంధనలు ఉల్లంఘించినట్లుగా భావించి తగు చర్యలు తీసుకుంటామని అథారిటీ స్పష్టం చేసింది. అదే విధంగా ప్రీ లాంచింగ్ పేరుతో అమ్మకాలు చేపట్టడం కూడా చట్ట ప్రకారం శిక్షర్హులుగా పరిగణిస్తామన్నారు.
అక్రమ వ్యాపారమే
శేరిలింగంపల్లి మండలం హఫీజ్ పేట సర్వే నం.80లో బిల్డాక్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీ ప్రాజెక్టు చేపడుతుందని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు. ఐతే అక్కడ ఈ సంస్థకు ల్యాండ్ లేదని రెరా విచారణలో తేలింది. కేవలం ఆ ఏరియాలో స్థలాన్ని తీసుకునేందుకు ప్రయత్నాలు మాత్రమే చేస్తున్నారు. ఇదే విషయాన్ని ‘దిశ’ మార్చి ఒకటో తేదీన ‘బిల్డాక్స్.. ప్రీ లాంచ్! చదరపు అడుగు ధర కేవలం రూ.4699 మాత్రమే. సోషల్ మీడియా ద్వారా ఏజెంట్ల ప్రచారం’ అంటూ కథనాన్ని పబ్లిష్ చేసి కస్టమర్లను అప్రమత్తం చేసింది. అప్పటి నుంచి బిల్డాక్స్ సంస్థకు రెరా షోకాజ్ నోటీసులు, నోటీసులు జారీ చేస్తూనే ఉన్నది. తాజాగా గురువారం సమగ్ర విచారణ చేసి పెనాల్టీ విధించింది. కొందరు కస్టమర్లు కూడా ఈ సోషల్ మీడియా ప్రకటనల ద్వారా బిల్డాక్స్ ప్రాజెక్టు గురించి ఆరా తీశారు. వాట్సాప్ ద్వారా చాట్ చేసి వివరాలు రాబట్టారు.
హఫీజ్ పేట సర్వే నం.80లోనే ప్రాజెక్టు అంటూ కొండాపూర్ ఏరియా అంటూ చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్, ఫ్లోర్ ప్లాన్ వంటివి కూడా కస్టమర్ కి షేర్ చేశారు. అవన్నీ రెరాకు సమర్పించారు. కొందరు ఆశ పడి రూ.లక్షల్లో చెల్లించినట్లు ఫిర్యాదులు అందాయి. విచారణలో ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపారం సాగిస్తున్నట్లు తేలింది. దాంతో రూ.3,96,39,600 లను 30 రోజుల్లో చెల్లించాలని బిల్డాక్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీని రెరా అథారిటీ ఆదేశించింది. పెనాల్టీ ఆర్డర్ నం.1626/2023, తేదీ.4.4.2024 ద్వారా రెరా చైర్ పర్సన్ డా.ఎన్.సత్యనారాయణ, సభ్యులు కె.శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ జన్ను అపరాదు రుసుం కట్టాలని స్పష్టం చేశారు.