Cyber Frauds : ఈ మధ్యే ప్రారంభమైన కొత్త తరహా సైబర్ మోసం.. ఎక్స్‌లో తెలంగాణ పోలీస్ వెల్లడి

by Ramesh N |
Cyber Frauds : ఈ మధ్యే ప్రారంభమైన కొత్త తరహా సైబర్ మోసం.. ఎక్స్‌లో తెలంగాణ పోలీస్ వెల్లడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల కాలంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయి. సరికొత్త పంథాల్లో మోసాలకు సైబర్ కేటుగాళ్లు పాల్పడుతుండటంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. ఈ క్రమంలోనే శనివారం తెలంగాణ పోలీసులు ఎక్స్ వేదికగా ప్రజలకు ఒక అలర్ట్ ఇచ్చారు. ‘ఈ మధ్యే ప్రారంభమైన ఒక కొత్త తరహా మోసమిది. పొరపాటున గూగుల్ పే కి కొంత డబ్బు వచ్చిందంటూ అమౌంట్ నంబర్‌తో కూడిన మెసేజ్ పంపిస్తారు.

మనం ఆ మెసేజ్‌లో ఉన్న అమౌంట్ నంబర్ చూసి ఆ డబ్బు నిజంగా వచ్చిందేమో అనుకొని తిరిగి పంపించామో మనం మోసపోయినట్లే! అప్రమత్తంగా ఉండడం మన బాధ్యత’ అని తెలంగాణ పోలీసులు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కాగా, రోజు రోజుకు ఆన్‌లైన్‌లో లావాదేవీలు పెరిగిపోతుండటంతో దీన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు సైబర్ కేటుగాళ్లు కొత్త కొత్త మార్గాల ద్వారా నేరాలకు పాల్పడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed