- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీఆర్ఎస్‌ఎల్పీ నాయకుడెవరు.. కేసీఆర్.. కేటీఆర్.. హరీశ్‌రావు..?
దిశ, తెలంగాణ బ్యూరో: గులాబీ పార్టీ ఓటమితో బీఆర్ఎల్పీ లీడర్‌గా ఎవరు ఉంటారు? అనే చర్చ మొదలైంది. కేసీఆర్ ఉంటారా? లేకపోతే కేటీఆర్‌కు అప్పగిస్తారా? హరీశ్ రావుకు చాన్స్ ఇస్తారా? అనేది ఆసక్తిగా మారింది. మొన్నటి వరకు అధికారాన్ని అనుభవించిన కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష లీడర్‌గా పనిచేసేందుకు సుముఖంగా ఉంటారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సభలో రూలింగ్ పార్టీ నుంచి వచ్చే విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొనే ఓపిక, సహనం కేసీఆర్‌కు ఉన్నాయా? అనే చర్చ జరుగుతున్నది. ఆ బాధ్యతలను కేటీఆర్, హరీశ్ రావులో ఎవరికైనా అప్పగిస్తారా? అనే ఆసక్తి నెలకొంది.
ప్రతిపక్ష పాత్రలో కేసీఆర్‌కు కష్టం..?
పదేళ్లపాటు కేసీఆర్ కనుసన్నల్లోనే అసెంబ్లీ సమావేశాలు జరిగేవి. ఆయనకు ఇష్టం ఉన్నన్ని రోజులే, అందులో ఆయనకు ఇష్టం ఉన్న అంశాలపైనే చర్చ చేపడుతారనే విమర్శలూ ఉండేవి. అలాంటి కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్షనేతగా సభలో కూర్చోవడం కష్టమనే అభిప్రాయాలు బీఆర్ఎస్‌లోనే ఉన్నాయి. అలాగే బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలపై అసెంబ్లీ వేదికగా చర్చించి, ఎంక్వైరీలు వేసే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. ఆ విమర్శలు, ఆరోపణలకు ఓపికగా కౌంటర్ ఇచ్చే ఓపిక కేసీఆర్‌కు లేవనే టాక్ ఉంది. ఈ క్రమంలో కేసీఆర్ అసెంబ్లీలోకి అడుగుపెట్టడం కష్టమనే ప్రచారం జరుగుతున్నది. అందుకని తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమో, లేకపోతే డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా కేటీఆర్, హరీశ్‌లో ఒకరికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని చర్చ జరుగుతున్నది.
కాంగ్రెస్‌ను కేటీఆర్ ఫేస్ చేయగలరా..?
ఒకవేళ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తే, ప్రతిపక్షనేతగా కేటీఆర్‌కు అప్పగిస్తారా..? హరీశ్‌కు చాన్స్ ఇస్తారా? అనే ఆసక్తికర చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీని ఫేస్ చేసే శక్తి, యుక్తులు కేటీఆర్‌కు లేవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉద్యమ సమయంలో కేటీఆర్ పెద్దగా సభలో మాట్లాడిన దాఖలాలు లేవు. హరీశ్ రావు మాత్రమే ఏపీ లీడర్ల విమర్శలకు ఘాటుగా సమాధానం చెప్పేవారు. అందుకే ప్రస్తుతం రూలింగ్ పార్టీని ఢీకొనే శక్తి హరీశ్ రావుకే ఉన్నట్టు బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. అయితే కొడుకును కాదని అల్లుడు హరీశ్‌కు ఆ చాన్స్ ఇస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రతిపక్ష పాత్రలో సమర్థవంతంగా పనిచేసిన లీడర్‌కే భవిష్యత్ రాజకీయాల్లో ప్రయారిటీ ఉంటుందని టాక్ నడుస్తోంది.
Also Read: అహంభావం దొరహంకారం.. వెరసి పతనం..