Telangana Chief Minister K. Chandrashekar Rao : కాన్వాయ్‌లోకి కొత్తకారు

by Seetharam |   ( Updated:2023-06-24 14:31:07.0  )
Telangana Chief Minister K. Chandrashekar Rao : కాన్వాయ్‌లోకి కొత్తకారు
X

దిశ,వె‌బ్‌డెస్క్: తెలంగాణ సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లో మరో కొత్త కారు చేరింది. సీఎం భద్రతలో భాగంగా మరో ఖరీదైన కారును అధికారులు కొనుగోలు చేశారు. సీఎం భద్రత కోసం రూ. 1 కోటీ 30 లక్షల విలువ చేసే ల్యాండ్ క్రూజర్‌ కారును కాన్వాయ్‌లో చేర్చారు. చాలా ప్రత్యేకతలను కలిగిన ఈ ల్యాండ్ క్రూజర్‌ వెహికిల్‌కి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక వాహన పూజ నిర్వహించారు. అనంతరం సీఎం కాన్వాయ్‌లో దీనిని చేర్చారు. అధికారులు ఈ కారును హైదరాబాద్ నుంచి యాదాద్రి ఆలయానికి ఎస్కార్ట్‌తో తీసుకు వెళ్లి.. ప్రత్యేక పూజలు చేయించారు. ఇప్పటికే సీఎం కాన్వాయ్‌లో మొత్తం 15 కార్లు ఉండగా.. ఈ కారు రాకతో కాన్వాయ్‌లో కార్ల సంఖ్య 16కి చేరింది.

Read more: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారుకు ప్రమాదం.. రక్తపు మరకలతో ఆస్పత్రిలో చేరిక

Advertisement

Next Story