వధూవరుల తలపై నుండి జీలకర్ర బెల్లం ఎత్తుకెళ్లిన కోతి (వీడియో)

by GSrikanth |   ( Updated:2024-06-02 15:25:25.0  )
వధూవరుల తలపై నుండి జీలకర్ర బెల్లం ఎత్తుకెళ్లిన కోతి (వీడియో)
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: శుభ ముహూర్తం.. రాగానే వధూవరులు వేదమంత్రాలు చదువుతుండగా.. సన్నాయి డోలు మోగుతుండగా వధూవరులు ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకొని ఆనందిస్తుండగానే.. ఒక్కసారిగా మెరుపుతీగలా వచ్చింది ఓ కోతి. అంతేవేగంగా వధువు వరుల తలలపై ఉన్న జీలకర్ర బెల్లాన్ని తీసుకొని వెళ్ళిపోయింది. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో వధూవరులతో పాటు అక్కడే ఉన్న బంధుమిత్రులు ఒకింత భయానికి గురయ్యారు. ఆ వెంటనే అందరూ నవ్వులలో మునిగి తేలారు. ఏదో ఒక దేవాలయం వద్ద జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తూ అందరినీ నవ్విస్తోంది.


Advertisement

Next Story