కవితకు ఎమ్మెల్యే టికెట్ రావాలని ఆమె అభిమాని ఏం చేశాడంటే?

by Javid Pasha |   ( Updated:2022-12-25 12:57:07.0  )
కవితకు ఎమ్మెల్యే టికెట్ రావాలని ఆమె అభిమాని ఏం చేశాడంటే?
X

దిశ నెల్లికుదురు: తాము అభిమానించే వ్యక్తుల కోసం ఫ్యాన్స్ ఏదైనా చేస్తుంటారు. అయితే ఈ ఫ్యాన్స్ గోల ఎక్కువగా సినీ రంగంలో కనిపిస్తుంటుంది. కానీ ఈ మధ్య పొలిటీషియన్లకు కూడా ఫ్యాన్స్ ఎక్కువయ్యారు. ఇక విషయానికి వస్తే.. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు ఎమ్మెల్యే టికెట్ రావాలని కోరుతూ నెల్లికుదురు మండలం చిన్న నాగారం గ్రామానికి చెందిన బాలాజీ నాయక్ ఆదివారం మోకాళ్లతో తిరుపతి మెట్లు ఎక్కాడు. వచ్చే ఎన్నికల్లో మహబూబాబాద్ ఎమ్మెల్యే టికెట్ కవితకు రావాలని మోకాళ్ల మీద నడుస్తూ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నాడు. మాలోత్ కవిత ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావిస్తారని బాలాజీ నాయక్ చెప్పాడు.

Advertisement

Next Story