- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ.. ప్రయాణికులకు గాయాలు
దిశ, భిక్కనూరు : ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓవర్ టెక్ చేయబోయి, లారీ ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్‌తో సహా ఇద్దరు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే... నిజామాబాదు2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాదు నుంచి నిజామాబాద్‌కు వెళుతోంది. అయితే ఆర్టీసీ బస్సు బుధవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో టోల్ గేటు దాటి ఎడ్ల కట్ట వద్దకు రాగానే ముందు వెళ్తున్న బస్సును వెనకాల వస్తున్న లారీని ఢీకొని డివైడర్‌పైకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ రాజు తీవ్రంగా గాయపడడంతో అంబులెన్స్‌లో కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న సుమాలి, పోతయ్య గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అందులో ఉన్న ప్రయాణికులు రోడ్డుపై దిగి వేరే బస్సులను ఆపుకొని వెళ్ళగా, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ మాత్రం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు భిక్కనూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తప్పించి లైన్ క్లియర్ చేశారు.