- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సొంత ఇలాకాలో కేటీఆర్‌కు మరో బిగ్ షాక్.. బీఆర్ఎస్‌కు భారీ సంఖ్యలో నేతల రాజీనామా
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుండి ఇంకా పూర్తిగా తేరుకోకముందే బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలుకావడంతో కొందరు లీడర్లు అధికార కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుండగా.. మరోవైపు పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాలకు సిద్ధం అవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం అవుతోన్న బీఆర్ఎస్ అధిష్టానానికి ఈ వ్యవహారాలు కొత్త తలనొప్పిగా మారాయి.ఇదిలా ఉండగానే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఊహించని షాక్ తగలింది. కేటీఆర్ సొంత ఇలాకా సిరిసిల్ల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లీడర్స్ రాజీనామాల బాటపట్టారు.
సోమవారం ముస్తాబాద్ జెడ్పీటీసీతో పాటు పలువురు సర్పంచులు, పార్టీకి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ముస్తాబాద్ జెడ్పీటీసీ గుండం నర్సయ్య, మొఱ్ఱపుర్ సర్పంచ్ దేవేందర్, అవునూర్ సర్పంచ్ బద్దీ కల్యాణి భాను, వెంకట్రావు పల్లె సర్పంచ్ లక్ష్మణ్, సర్పంచ్‌ల ఫోరమ్ అధ్యక్షుడు కిషన్ రావు, మాజీ జెడ్పీటీసీ యాదగిరి గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు అంజన్ రావు, సురభి సురేందర్ రావు, సీనియర్ నాయకులు అన్నామనేని సుధాకర్ రావు, నారాయణ రావు, ధర్మేండర్, మహిపాల్ తదితరులు గులాబీ పార్టీకి గుడ్ చెప్పారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సొంత ఇలాకాలో ఒక్కరోజే భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీకి లీడర్లు రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.