వెలుగులోకి మరో స్కామ్.. మల్టీ జెట్ స్కీమ్ పేరుతో భారీ మోసం

by Satheesh |   ( Updated:2022-11-26 14:07:21.0  )
వెలుగులోకి మరో స్కామ్.. మల్టీ జెట్ స్కీమ్ పేరుతో భారీ మోసం
X

దిశ, వెబ్‌డెస్క్: మల్టీ జెట్ స్కీమ్ పేరుతో జరిగిన భారీ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రూ.14 వేలు పెడితే భారీ లాభాలంటూ కేటుగాళ్లు ప్రచారం చేశారు. రూ.14 వేలకు ప్రతిరోజూ డబ్బులు ఇస్తామని చెప్పడంతో నిజమని నమ్మిన ప్రజలు.. వేల సంఖ్యలో పెట్టుబడులు పెట్టారు. మొదట్లో ఎలాంటి అనుమానం రాకుండా కొన్నాళ్లపాటు మల్టీజెట్ స్కీమ్ నిర్వహకులు డబ్బు చెల్లించారు. గత కొంత కాలంగా డబ్బులు చెల్లించకపోవడంతో ఆందోళన చెందిన కస్టమర్లు పోలీసులను ఆశ్రయించారు. మల్టీ జెట్ స్కీమ్ పేరుతో దాదాపుగా రూ.100 కోట్లకు పైగానే కుచ్చుటోపి పెట్టినట్లు తెలుస్తోంది. మల్టీ జెట్ ఎండీ ముత్తిరాజు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎండీ ముత్తిరాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మల్టీ జెట్ స్కీమ్ బాధితులు సీసీఎస్ దగ్గర ఆందోళనకు దిగారు.

Advertisement

Next Story