హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-15 16:16:54.0  )
హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్‌పై తుపాన్ వాహనాన్ని అతివేగంగా వచ్చిన ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 14 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. శంషాబాద్ మండలం పెద్ద గొల్కోండ వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన, మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story