హైదరాబాద్‌ పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం

by Gantepaka Srikanth |
హైదరాబాద్‌ పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం పురానాపూల్‌లోని ఓ టెంట్‌ హౌస్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా స్థానిక దుకాణా దారులంతా భయాందోళనతో అక్కడి నుంచి పరుగులు తీశారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఐదు ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అంతకుముందు భవనంలో ఉన్న వారిని అధికారులు ఖాళీ చేయించారు. కాగా, ఇటీవల కాలంలో పాతబస్తీలో తరచూ అగ్ని ప్రమాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా ఎక్కడో ఒక చోట నిర్లక్ష్యం కారణంగానో, అనుకోని పరిస్థితుల కారణంగానో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

Advertisement

Next Story