పత్తి మిల్లులో భారీ అగ్ని ప్రమాదం.. రూ.8 కోట్ల మేర నష్టం

by GSrikanth |
పత్తి మిల్లులో భారీ అగ్ని ప్రమాదం.. రూ.8 కోట్ల మేర నష్టం
X

దిశ, మక్తల్: నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వడ్వాట్ గ్రామ సమీపంలో ఉన్న బసవేశ్వర జిన్నింగ్, కాటన్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన షార్ట్ సర్క్యూట్‌తో మిల్లు కాలిబూడిదైంది. ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో మిల్లులో ఉన్న పత్తి బండల్స్, జిన్నింగ్ చేయడానికి తీసుకొచ్చిన విత్తనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన పక్క రైస్ మిల్లు కూలీలు యజమానికి విషయం తెలిపారు. దీంతో యజమాని వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. నారాయణపేట, మక్తల్ నుండి పెద్ద ఎత్తున ఫైర్ ఇంజిన్లు, ఇతర వాటర్ ట్యాంకర్లను రప్పించి మంటలు ఇతర మిల్లులకు వ్యాపించకుండా అదుపు చేశారు. మిల్లుతో పాటు, జిన్నింగ్ కోసం తెచ్చిన విత్తనాలు, పత్తి పూర్తిగా కాలిపోయాయి. దాదాపుగా రూ.8 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు మిల్లు యాజమాన్యం తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని వివరాలు సేకరిస్తున్నారు.




Advertisement

Next Story