- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: రేపు విచారణ.. బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్... టెన్షన్
దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. తన చిన్న కుమారుడు పరీక్షలు రాస్తున్నారని, ఈ మేరకు తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్‌లో కవిత పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై రౌజ్ అవెన్యూ కోర్టు (సీబీఐ ప్రత్యేక కోర్ట్)లో సోమవారం విచారణ జరగనుంది. ఈ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు న్యాయ మూర్తి కావేరి బవేజా విచారించనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు అవుతుందా.. లేదా అనే ఉత్కంఠ బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. మరోవైపు ఈడీ అధికారులు మాత్రం ఎమ్మెల్సీ కవితను బెయిల్ ఇవ్వొద్దని కోరుతున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో కవిత ప్రధాన సూత్రధారిగా ఉన్నారని, దాదాపు రూ.100 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఇప్పటికే కవితను కస్టడీకి తీసుకుని విచారించారు.