- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రజాకార్ల వారసులు పిడికెడు మంది! కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్
దిశ, తెలంగాణ బ్యూరో: రజాకార్ల వారసులు కేవలం పిడికెడు మంది ఉన్నారని, కేవలం వారి సంతోషం కోసం విమోచన వేడుకలు నిర్వహించరా? అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. భారత ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ను అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విమోచన వేడుకలు నిర్వహిస్తే కేంద్రం అందులో భాగస్వామ్యం అయ్యేందుకు సిద్ధంగా ఉందని ఆయన స్పష్టంచేశారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మంగళవారం నిర్వహించిన విమోచన వేడుకల్లో బండి సంజయ్ మాట్లాడారు. భారతదేశానికి ఆగస్టు 15 న స్వాతంత్ర్యం వచ్చిందని, కానీ తెలంగాణకు మాత్రం సెప్టెంబర్ 17న తెలంగాణకు వచ్చిందని తెలిపారు. రజాకార్ల ఆగడాలను సినిమాగా తీసిన గూడూరు నారాయణ రెడ్డికి బండి సంజయ్ అభినందించారు. కిషన్ రెడ్డి చొరవతోనే అధికారికంగా విమోచన దినోత్సవం జరుగుతోందన్నారు. తెలంగాణలో ప్రతి గ్రామం రజాకార్లపై పోరాడారని, పోరాటం ఈ మట్టిలోనే ఉందన్నారు. సర్దార్ పటేల్ నిజమైన దేశ భక్తుడని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విమోచన వేడుకలు నిర్వహించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఓటు బ్యాంకు కోసం విమోచన వేడుకలు నిర్వహించడం లేదని విమర్శలు చేశారు. విమోచన వేడుకలు చేయకపోవడం ఆనాటి చరిత్రను కనుమరుగు చేసినట్టే అని ఫైరయ్యారు. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. అధికారంలో లేనప్పుడు విమోచన వేడుకలకు డిమాండ్ చేసిన పార్టీ.., అధికారంలోకి వచ్చాక విస్మరించిందని మండిపడ్డారు. ప్రజలను ఏమార్చడమే ప్రజా పాలనా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.
అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని బండి సంజయ్ పర్యవేక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వక్ఫ్ బోర్డు ఇష్యూకు చెక్ పెట్టాలని.. కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. ఎవరికీ ఇబ్బందులు జరగకుండా ప్రక్రియ పూర్తి చేయాలని భావించి జేపీసీ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణ నుంచి మెంబర్ గా డీకే అరుణకు అవకాశం కల్పించిందని ఆయన పేర్కొన్నారు. హామీలు ఇచ్చిన వాటితో పాటు ఇవ్వని హామీలను సైతం మోడీ నెరవేర్చారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పలు కేటాయింపులను బండి సంజయ్ ప్రస్తావించారు.
మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక తమ 100 రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్ ను చెప్పామని, కానీ కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తయినా వారు ఏం చేశారో చెప్పుకోలేని పరిస్థితి ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను కూడా అమలు చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలననే కాంగ్రెస్ కొనసాగిస్తోందని చురకలంటించారు. రుణమాఫీ పేరిట అబద్ధాలు చెప్పడం తప్పా కాంగ్రెస్ ఏం చేసిందని బండి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రజా పాలన పేరిట వేడుకలు చేస్తోందని, కానీ దేశాన్ని 50 ఏండ్లకు పైగా కాంగ్రెస్ పాలించిందని, మరి అప్పుడు ఎందుకు ఆ పేరుతో వేడుకలు చేయలేదని ప్రశ్నించారు. అంటే అప్పుడు ప్రజా వంచన చేశారా? అని నిలదీశారు. అందుకే అప్పుడు ప్రజాపాలన పేరిట నిర్వహించలేదా? అని పేర్కొన్నారు. కేవలం ఎంఐఎం నేతలను హర్ట్ చేయడం ఇష్టం లేక ప్రజాపాలన పేరు పెట్టారన్నారు. బీఆర్ఎస్ గతంలో సమైక్యతా దినోత్సవం పేరిట వేడుకలు నిర్వహించిందని, వాళ్లకు కూడా ఆ పేరుతో ఎందుకు నిర్వహించారో తెలియదని సెటైర్లు వేశారు. సర్దార్ పటేల్ వారసులం తామే అని కాంగ్రెస్ ఇప్పుడు చెబుతోందని, మరి వారు ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదన్నారు. కనీసం ఆయన విగ్రహం కూడా పెట్టలేదని ఫైరయ్యారు. సోనియా, రాహుల్, ప్రియాంక ఎన్నడూ పటేల్ పేరు ఎందుకు ప్రస్తావించలేదో సమాధానం చెప్పాలన్నారు. వాళ్లకు పటేల్ పై ప్రేమ లేదని, నిజాం, నెహ్రూపైనే వారికి ప్రేమ ఎక్కువ అని విమర్శలు చేశారు.