తెలంగాణ శాసనసభను సందర్శించిన జర్మనీ పార్లమెంట్ సభ్యుల బృందం

by M.Rajitha |
తెలంగాణ శాసనసభను సందర్శించిన జర్మనీ పార్లమెంట్ సభ్యుల బృందం
X

దిశ, వెబ్ డెస్క్ : జర్మనీ దేశంలోని రెనిలాండ్(Rheniland) రాష్ట్ర పార్లమెంట్ సభ్యుల బృందం నేడు తెలంగాణ శాసనసభను సందర్శించారు. తెలంగాణ శాసనసభకు విచ్చేసిన రెనిలాండ్ రాష్ట్ర పార్లమెంట్ స్పీకర్ హెన్ర్డిక్ హేరింగ్ నాయకత్వంలోని ఎనిమిది మంది సభ్యుల బృందానికి తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించారు. జర్మనీ బృంద సభ్యులను శాలువా, మెమొంటోలతో సత్కరించారు. అనంతరం స్పీకర్ ఛాంబర్లో సమావేశమైన తెలంగాణ- జర్మనీ సభ్యుల బృందం వివిధ రంగాలలో సహకారంపై చర్చించుకున్నారు .

ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో అత్యధిక ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. అన్ని రంగాల్లో అత్యాధునిక, సాంకేతిక టెక్నాలజీ ద్వారా అభివృద్ధిని సాధిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అన్ని దేశాలు ఆసక్తిని చూపిస్తున్నాయని, జర్మనీ దేశానికి కూడా అన్ని సహకారాలు అందిస్తామని తెలియజేశారు. తెలంగాణ అసెంబ్లీ, మండలి భవనాలు చారిత్రక కట్టడాలని, నిజాం హయంలో నిర్మించిన పాత అసెంబ్లీ భవనాన్ని ఆధునికీకరణ చేస్తున్నామని పేర్కొన్నారు.

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ " తెలంగాణ ప్రాంతం సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నతమైనవని, తెలంగాణ రాష్ట్రం శాసనసభ, శాసనమండలి ఉన్నాయని, శాసనసభలో 119 మంది సభ్యులు, శాసనమండలి లో 40 మంది సభ్యులు ఉన్నారని వివరించారు. తెలంగాణ శాసనసభలో చర్చలు అర్ధవంతంగా జరుపుతున్నామని తెలిపారు.

Advertisement

Next Story