హైదరాబాద్ శివారులో గ్యాంగ్ వార్.. 4 గంటల పాటు సినిమాను తలపించిన హై డ్రామా!

by Satheesh |
హైదరాబాద్ శివారులో గ్యాంగ్ వార్.. 4 గంటల పాటు సినిమాను తలపించిన హై డ్రామా!
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: హైదరాబాద్ శివారు నార్సింగిలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత హై డ్రామా చోటు చేసుకుంది. కోట్ల రూపాయల విలువ చేసే ఓ స్థలం మాదంటే మాదంటు రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. పోలీసు కంట్రోల్ రూంకు పలుమార్లు ఫోన్లు చేసినా, పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా ఏ ఒక్కరూ స్పందించక పోవటం గమనార్హం. ఈ స్థలంపై ఓ మంత్రి కన్ను ఉందని, అందుకే పోలీసులు స్పందించలేదని ఓ వర్గం ఆరోపించింది. కోకాపేటలోని ఓ విలువైన స్థలంలో తెల్లవారుజాము 2 గంటల సమయంలో ఓ గ్యాంగ్ కంటైనర్‌ను తెచ్చి పెట్టి అక్కడే కూర్చుంది.

విషయం తెలిసి అక్కడకు వచ్చిన మరోవర్గం స్థలం మాదంటూ అక్కడి నుంచి వెళ్లిపొమ్మన్నారు. అయితే, కంటైనర్ తెచ్చి పెట్టిన గ్యాంగ్ అక్కడి నుంచి కదలలేదు. దీంతో రెండు వర్గాల మధ్య బాహాబాహీ జరిగింది. పలుమార్లు కంట్రోల్ రూమ్‌కు ఫోన్లు చేసినా, స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఓ వర్గం ఆరోపించింది. ఓ మంత్రి కన్ను ఆ భూమి పై ఉండటం వల్లనే పోలీసులు స్పందించలేదని పేర్కొన్నాయి.

Advertisement

Next Story