- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిల్లలకు చాక్లెట్లు కొనిస్తున్నారా?.. ఒక్క క్షణం ఆలోచించండి!
దిశ తెలంగాణ క్రైమ్ బ్యూరో: మీ పిల్లలకు చాక్లెట్లు కొనిస్తున్నారా?.. ఒక్క క్షణం ఆలోచించండి. ఎందుకంటే కాలం చెల్లిన చాక్లెట్లు, బిస్కెట్లను ఎద్ద ఎత్తున రీసైక్లింగ్చేస్తూ.. మార్కెట్లో చలామణిలోకి తెస్తున్న ముఠా వైనం మంగళవారం వెలుగులోకి వచ్చింది. కోఠిలోని హరిహంత్ కార్పోరేషన్కేంద్రంగా పెద్ద ఎత్తున రీసైక్లింగ్చేసిన తినుబండారాలను మార్కెట్లోకి పంపిస్తున్నట్టుగా ఇటీవల రాచకొండ పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందం దీనిపై నిఘా పెట్టింది. మంగళవారం పక్కగా అందిన సమాచారం మేరకు బోడుప్పల్‌లోని రీసైక్లింగ్యూనిట్పై దాడి చేసింది.
విచారణలో ఈ ముఠా చిన్నపిల్లలు తినే చాక్లెట్లు, బిస్కెట్లతో పాటు మొత్తం మూడు వందల రకాల తినుబండారాలను రీసైక్లింగ్ చేస్తున్నట్టు వెల్లడైంది. కాలం చెల్లిన వీటిని నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న కిరాణా దుకాణాల నుంచి తక్కువ రేట్లకు కొని రీసైక్లింగ్‌చేసి కొత్త కవర్లలో ప్యాక్ చేస్తూ అక్రమంగా పెద్ద ఎత్తున లాభాలు సంపాదిస్తున్నట్టుగా తేలింది. ఈ క్రమంలో పోలీసులు కోట్ల రూపాయల విలువ చేసే ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలియవచ్చింది. దీనిపై ఓ పోలీసు అధికారితో మాట్లాడగా విచారణ కొనసగుతున్నట్టు చెప్పారు. త్వరలోనే అన్ని వివరాలను వెల్లడిస్తామన్నారు.