TSPSC ఆఫీస్ దగ్గర పోస్టర్ల కలకలం

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-22 04:57:19.0  )
TSPSC ఆఫీస్ దగ్గర పోస్టర్ల కలకలం
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: ``ఇక్కడ అన్ని ప్రశ్నపత్రాలు దొరుకును´´... అంటూ టీఎస్పీఎస్సీ ఆఫీస్ వద్ద వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి. ఇది ఉద్యోగాలను భర్తీ చేసే బోర్డు కాదు.. ప్రశ్నపత్రాల జిరాక్స్ సెంటర్ అంటూ రాత్రికిరాత్రి వెలిసిన ఈ పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఓయూ జేఏసీ నాయకుడు అర్జున్ బాబు పేరు మీద ఈ పోస్టర్లు ఉన్నాయి. కాగా ఇటీవల టీఎస్పీఎస్సీలో ప్రశ్నాపత్రాల లీకేజీ అంశం రాష్ట్రాన్ని షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వెలసిన పోస్టర్ల అంశం చర్చనీయాంశమైంది.

Advertisement

Next Story