మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌పై కేసు నమోదు..!

by Satheesh |   ( Updated:2024-05-31 15:58:33.0  )
మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌పై కేసు నమోదు..!
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు అయ్యింది. అనుమతి లేకుండా చార్మినార్ వద్ద నిరసన తెలపడంతో కేటీఆర్‌పై చార్మినార్ స్టేషన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, పద్మారావు గౌడ్, పొన్నాల లక్ష్మయ్య ఇతర నాయకుల‌పై సెక్షన్ 188 కింద కేసు రిజిస్టర్ అయ్యింది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అధికారిక చిహ్నాంలో మార్పులు చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లోగోలో ఉన్న కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ను తొలగించి వాటి స్థానాల్లో కొత్త డిజైన్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. లోగోలో మార్పులు చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ భగ్గుమంటుంది. తెలంగాణ అస్థిత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ వ్యవహారిస్తోందని ఫైర్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర లోగోలో మార్పులను నిరసిస్తూ గురువారం మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యేలు చార్మినార్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ క్రమంలోనే అనుమతి లేకుండా చార్మినార్ వద్ద ఆందోళన చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story