- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజాసింగ్‌కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయింపు
X
దిశ, వెబ్‌డెస్క్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ప్రభుత్వం మరో బుల్లెట్ ప్రూఫ్ వాహానాన్ని కేటాయించింది. తనకిచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారు తరచూ మొరాయిస్తోందని పలుమార్లు రాజాసింగ్ సీఎం కేసీఆర్, డీజీపీ, హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇదే అంశమై ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రగతిభవన్ తీసుకెవెళ్లి అక్కడే తన పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వదిలిపెట్టి వచ్చారు.
ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఆయనకు కేటాయించారు. కాగా ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనం 2017 మోడల్ కావడం గమనార్హం. వాహనం కేటాయింపుపై స్పందించిన రాజాసింగ్ తెలుపు రంగు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తన ఇంటి వద్ద పోలీసులు వదిలి వెళ్లినట్లు తెలిసింది. కొత్త కారే కావాలని తనకు లేదని కారు కండిషన్ బాగుంటే చాలని ఈ సందర్భంగా రాజాసింగ్ తెలిపారు.
Advertisement
Next Story