- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి గులాబీ పార్టీ సిట్టింగ్ MLA..?
దిశ, హైదరాబాద్ బ్యూరో: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగులనుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ పార్టీ నుంచి రెండవ పర్యాయం గెలిచిన ఓ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. ఇందులో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని తన నివాసంలో ముఖ్య అనుచరులతో అత్యవసర సమావేశం నిర్వహించి పార్టీ మార్పు గురించి వారితో చర్చించి తనతో కలిసి రావాలని కోరినట్లు తెలిసింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంతో టచ్‌లోకి వెళ్లిన సదరు ఎమ్మెల్యే త్వరలోనే హస్తం గూటికి చేరతారనే ప్రచారం నియోజకవర్గంలో మొదలైంది.
అయితే హస్తం పార్టీ నేతలు కూడా ఆయన చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఆ ఎమ్మెల్యే తన ముఖ్య అనుచరులతో రాత్రి వరకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరేంత వరకు విషయం బయటకు పొక్కనీయవద్దని, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తనతో కలిసి వచ్చే వారికి విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. బీఆర్ఎస్‌లో ఉంటే రాజకీయ భవిష్యత్ లేదని భావిస్తున్న ఈ ప్రజాప్రతినిధి పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్‌లోపే పార్టీ మారాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
మొదటి ఎమ్మెల్యే..?
హైదరాబాద్ జిల్లాలో ఉన్న 15 నియోజకవర్గాలలో ప్రస్తుతం ఏడుగురు ఎంఐఎం, ఒక బీజేపీ, ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్యే బాటలోనే త్వరలోనే మరి కొందరు ఉంటారనే ప్రచారం జోరందుకుంది. దీంతో పార్లమెంట్ ఎన్నికలలోపు జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారే పరిస్థితులు కనబడుతున్నాయి.