- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణలో కొత్తగా 9 కరోనా కేసులు.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు ఎన్నంటే?
దిశ, వెబ్‌డెస్క్: గతంలో వచ్చిన కరోనా మహమ్మారి కారణంగా కుటుంబాలు చిన్నాభిన్నామయ్యాయి. ఇక కరోనా పోయిందనుకున్న క్రమంలోనే మళ్లీ అదృశ్యమయ్యింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతుండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 9 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు తెలంగాణలో 27 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా బారి నుంచి ఒకరు కోలుకున్నారు. ఇక తాజాగా నమోదైన 9 కేసుల్లో 8 మంది హైదరాబాద్, ఒకరు రంగారెడ్డి జిల్లా నుంచి ఉన్నారు.
తెలంగాణలో రికవరీ రేటు 99.51 శాతంగా ఉంది. నీలోఫర్ హాస్పిటల్‌లో 2నెలల చిన్నారికి కరోనా నిర్ధారణ కావడంతో ఆ పాపకు వెంటిలేటర్‌పై ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా 640 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 22 కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు వెలుగుచూశాయి. కేరళ, గోవాలో కొత్త వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉండటం గమనార్హం. కరోనా బారిన పడి కేరళలో తాజాగా మరో వ్యక్తి చనిపోయారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతుండటంతో 60 ఏళ్ల పైబడిన వృద్ధులు, 10 ఏళ్ల లోపు చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ హెచ్చరిస్తోంది.