- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోనియాగాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేదా?
దిశ, తెలంగాణ బ్యూరో: సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేదా అంటూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. వచ్చిన తెలంగాణను సర్వనాశనం చేసింది కేసీఆర్ అని మండిపడ్డారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు. అయితే దేశాన్ని కార్పొరేట్ శక్తులు విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ఎందరో మహనీయులు ప్రాణాలు త్యాగాల ఫలితమే స్వాతంత్ర్యం వచ్చిందన్నారు.
పేద ప్రజలను ఆదుకునేందుకు రాహుల్ గాంధీ నిత్యం కష్టబడుతున్నారన్నారు. అధికారంలోకి రాకపోయినా ప్రతిక్ష నాయకుడిగా దేశ ప్రజలకోసం పోరాడుతున్నాడని వివరించారు. భవిష్యత్‌లో అందరూ రాహుల్ గాంధీకి అండగా ఉండాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ వి.హనుమంత రావు, మాజీ మంత్రి శంకర్ రావు, కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, ఫిషర్ మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.