- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు.. అందుకే రైతుల ప్రయోజనాల కోసమే రూ.71 వేల కోట్లు
దిశ; తెలంగాణ బ్యూరో: రైతుల ప్రయోజనాల కోసమే వ్యవసాయానికి రూ.71 వేల కోట్లను బడ్జెట్ లో పొందుపరిచామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడుతూ..సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా పరిగణిస్తూ తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. అన్నదాతలకు సంకెళ్లు వేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని, కానీ తమ సర్కార్ రైతులకు పెద్దపీఠ వేసిందన్నారు.ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే తమ ముఖ్యమంత్రి బడ్జెట్ రూపకల్పన చేయించారన్నారు. కేసీఆర్ కు రాజ్యాంగం పైన ఏ మాత్రం నమ్మకం లేదన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. బడ్జెట్ లో నిధులు కేటాయించామన్నారు. ఆర్టీసీ బస్సు లో మహిళలు ఎలా ఉచితంగా ప్రయాణిస్తున్నారో కేసీఆర్ కు తెలియదా? అంటూ ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ ఊసే లేకపోతే కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు..? అని మండిపడ్డారు.
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ...రైతు రాజును చేయడమే బడ్జెట్ లక్ష్యమని, ఇది రైతు బడ్జెట్ అని కొనియాడారు. గత ప్రభుత్వం అహంకార పూరితంగా వ్యవహరించడం వలనే కేసీఆర్ మీడియా పాయింట్ కు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దమ్ము ,ధైర్యం ఉంటే కేసీఆర్ బడ్జెట్ పైన అసెంబ్లీలో చర్చకు రావాలన్నారు. కేసీఆర్ జైలు ఊసలు లెక్క పెట్టాల్సి వస్తుందన్నారు. కేసీఆర్ అవినీతి ని కక్కిస్తామన్నారు.గవర్నర్ వ్యవస్థకు, అసెంబ్లీ కి కేసీఆర్ ఏ మాత్రం మర్యాద ఇవ్వలేదన్నారు కేసీఆర్ ప్రభుత్వంలో గొర్రెల స్కాం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు ఇస్తే ఓర్వ లేకపోతున్నారన్నారు.
ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఎన్నడూ సెక్రటేరియట్ కు రాలేదని, ఎన్నికైన ప్రజాప్రతినిధులను కేసీఆర్ గౌరవించ లేదన్నారు. అహం పనికిరాదన్నారు. కేసీఆర్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. తెలంగాణ బడ్జెట్ పై కేసీఆర్ అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు.కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి బడ్జెట్ పైన చర్చించాలన్నారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ..రాష్ట్ర బడ్జెట్ పైన యావత్తు తెలంగాణ హర్షం వ్యక్తం చేస్తోందన్నారు. కేసీఆర్ బోగస్ బడ్జెట్ అంటున్నాడని, అసలు బోగస్ బీఆర్ఎస్, కేసీఆరే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.