- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు పెరిగినయ్: కేటీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా సంక్షేమం భద్రత సాధికారత విషయంలో తెలంగాణ ముందంజలో ఉందని మంత్రి కేటీఆర్ ఆదివారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. డెలివరీలు 2014లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం ఉండగా 2021 వరకు 52 శాతానికి పెరిగిందని, సుమారు 22 శాతం పెరిగాయని ఇది దేశంలోనే అత్యధికం అన్నారు. మాతృ మరణాల రేటు నెంబర్ 92 నుంచి 63 శాతానికి తగ్గిందని ఇది జాతీయ సగటులో 113శాతం అన్నారు. శిశు మరణాల రేటు 39 నుండి 23 శాతానికి తగ్గిందని ఇది జాతీయ సగటులో 42 శాతం అన్నారు. మహిళా సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతుందని వెల్లడించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 6 నుంచి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు మహిళా బంధు సంబురాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ కిట్ పేరుతో ఇప్పటివరకు 13 లక్షల 30 వేల మందికి అందజేశామని.. 16 వస్తువులతో కూడిన కిట్టు ఉంటుందని.. ఆడపిల్ల పుడితే 13000... మగ పిల్లవాడికి 12000 ఇస్తున్నట్లు తెలిపారు. అమ్మ ఒడి కింద 300 వాహనాలను ఏర్పాటు చేశామని ఆస్పత్రి నుంచి తల్లిని బిడ్డను ఇంటికి చేరుతున్నట్లు వెల్లడించారు.
This is the most important stat IMHO 👇 https://t.co/uVpZPjzmBF
— KTR (@KTRTRS) March 6, 2022