భూముల అమ్మకంలో రూ.1500 కోట్ల కుంభకోణం: Ramya Rao కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-08-21 12:58:47.0  )
భూముల అమ్మకంలో రూ.1500 కోట్ల కుంభకోణం: Ramya Rao కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాజేంద్రనగర్, బుద్వేల్ భూముల అమ్మకంలో కుంభ కోణం జరిగిందని కాంగ్రెస్ నేత రమ్యారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్‌లో ఉన్న వ్యక్తులే ఈ కుంభకోణంలో ఉన్నారని విమర్శించారు. ఆదివారం ఆమె సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పేదల భూములను కబ్జా చేస్తూ రూ.1500 కోట్ల స్కామ్ చేశారని ఆరోపించారు. 39 ఎకరాల 11 గుంటల స్థలాన్ని కబ్జా చేసి భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారన్నారు. వెన్నమనేని శ్రీనివాసరావు, గండ్ర ప్రవీణ్​రావు అనే వ్యక్తులు ఈ స్కామ్‌లో ఉన్నారని ఆరోపించారు. వీళ్లద్దరి వెనక సీఎం కేసీఆర్‌కు మందు బిళ్లలు ఇస్తూ రాజ్య సభ పొందిన శకుని హస్తం ఉన్నదని స్పష్టం చేశారు.

గతంలో క్యాంటీన్‌లో అటెండర్‌గా పనిచేసిన ఈ వ్యక్తులు ఆయన హస్తంతోనే అక్రమాలకు పాల్పడుతూ వేల కోట్లకు పడగలు ఎత్తారన్నారు. పది వేల రూపాయలకు జీతం చేసిన వ్యక్తికి వందల ఎకరాలు ఎలా వచ్చాయో? ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. ఈ భూ అక్రమాలపై పార్టీలకు అతీతంగా ప్రశ్నించాల్సిన​అవసరం ఉన్నదన్నారు. రాజ్యసభ సీటులో ఉన్న శకుని అనే వ్యక్తి సీఎంకు తెలియకుండానే చాలా అక్రమాలకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed