- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులెవరు.. 15 మంది కీలక నేతలు పోటీ
దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోన్నది. పార్టీలో క్రీయాశీలకంగా పనిచేసిన నేతల వివరాలను ఏఐసీసీ సేకరిస్తున్నది. దాదాపు 15 మంది కీలక నేతలు ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీ పడుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది. అయితే అసెంబ్లీ టిక్కెట్‌ను త్యాగం చేసినోళ్లకు అవకాశం ఇస్తారా? పోటీ చేసి ఓడిన ప్రముఖులకు కేటాయిస్తారా? అనేది త్వరలోనే తేలనున్నది. ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీలు ఖాళీ అవగా, ఇప్పుడు ఆ రెండింటికీ ఆశావహులు పోటీపడుతున్నారు. దీంతో కాంగ్రెస్ ఇద్దరి అభ్యర్ధులను నిలబెడుతుందా? ఒక్కరినే పోటీ లో ఉంచుతుందా? అని పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొన్నది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీని సులువుగా గెలుస్తుంది.
తమకూ ఒక ఎమ్మెల్సీ వస్తుందని బీఆర్ఎస్ ధీమాను వ్యక్తం చేస్తున్నది. అయితే రెండింటినీ తామే గెలవాలని కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పట్టుపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యతో రెండింటినీ గెలవడం కష్టమే. కానీ ఇతర పార్టీ ఎమ్మెల్యేల మద్ధతు కూడగడితే రెండు ఎమ్మెల్సీలను సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ గానూ పలువురి ఎమ్మెల్యేలతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇదే హాట్ టాఫిక్ గా మారింది. సీఎం రేవంత్ ఢిల్లీ నుంచి రాగానే ఎమ్మెల్సీ అభ్యర్దుల ఎంపికపై క్లారిటీ రానున్నదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఈ నెల 14వ తేదీన సీఎం రేవంత్ పెట్టుబడుల నిమిత్తం దావోస్‌కు వెళ్లనున్నారు. ఆ లోపే ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించి, తర్వాతి ప్రాసెస్ బాధ్యతలను పార్టీలోని కీలక నేతలకు అప్పగించనున్నట్లు తెలిసింది.
బిగ్ టాస్క్....?
ఎమ్మెల్సీ అభ్యర్ధులను ఎంపిక చేయడం కాంగ్రెస్ పార్టీకి బిగ్ టాస్క్ గా మారనున్నది. అసెంబ్లీ టిక్కెట్ పంపిణీ నేపథ్యంలో చాలా మంది వివిధ సమీకరణాలు దృష్ట్యా టిక్కెట్లు త్యాగం చేశారు. ఇప్పుడు వాళ్లంతా పదవుల కోసం వెయిట్ చేస్తున్నారు. మరోవైపు కొంత మంది సీనియర్లు టిక్కెట్లు తీసుకున్నప్పటికీ, ఓటమీ చెందారు. వీళ్లూ పదవులు ఆశిస్తున్నారు. ఈ రెండు కేటగిరీలను సమన్వయం చేస్తూ కాంగ్రెస్ పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పార్టీ క్షుణ్ణంగా కసరత్తు చేస్తోన్నది. ఇప్పటికే తమకు ఎమ్మెల్సీ వస్తుందని కొందరు నేతలు తమ అనుచరులకు ముందుగానే చెబుతున్నారు. క్షేత్రస్థాయి కేడర్ కూడా సంబురాలకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
పుల్ కాంపిటేషన్...?
ఎమ్మెల్సీ పదవుల కోసం అద్దంకి దయాకర్, చిన్నారెడ్డి, ప్రో కోదండరాం, మహేష్ కుమమార్ గౌడ్ , హర్కర వేణుగోపాల్ , మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ కుమార్ , వేం నరేందర్ రెడ్డి, బండ్ల గణేష్, తీన్మార్ మల్లన్న, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ, అందెశ్రీ, మాజీ ఎంపీ బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్, మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఫెరోజ్ ఖాన్, మధుయాష్కీ గౌడ్, జగ్గారెడ్డి, సంపత్ కుమార్, అంజన్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి పుష్ఫలీల, మైనంపల్లి హన్మంతరావు తదితరులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.