కాంగ్రెస్‌లో ముదిరిన సంక్షోభం.. 12 మంది కీలక నేతలు రాజీనామా

by GSrikanth |   ( Updated:2022-12-18 12:40:22.0  )
కాంగ్రెస్‌లో ముదిరిన సంక్షోభం.. 12 మంది కీలక నేతలు రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్‌లో సంక్షోభం మరింత ముదిరింది. సీనియర్ల వివాదం నడుస్తుండగానే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన కీలక నేతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 12 మంది ముఖ్య నేతలు ఆదివారం తమ పదవులకు రాజీనామా చేశారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, సీహెచ్ విజయరమణారావు, కల్వంపల్లి సత్యనారాయణ, సుభాష్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, చిలుమ మధుసూదన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, దొమ్మాటి సాంబయ్య, జంగయ్య యాదవ్, చారగొండ వెంకటేష్, సత్తు మల్లేష్, శశికళ యాదవరెడ్డి వంటి కీలక నేతలంతా టీపీసీసీ వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్కం ఠాగూర్‌కు రాజీనామా లేఖను పంపించారు. తమకు పదవులు ఇవ్వడం వల్ల సీనియర్లు అసంతృప్తితో ఉన్నారని, తమ పదవులు వారికి ఇవ్వాలంటూ లేఖలో పేర్కొన్నారు. దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతుందో తెలియక కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

కాంగ్రెస్ నేతల రాజీనామా లేఖలు: https://epaper.dishadaily.com/3633222/TRENDING/Congress#page/1/1

సెన్సేషనల్ న్యూస్: కాంగ్రెస్ సీనియర్లకు కోమటిరెడ్డి ఆహ్వానం...గతంలో తాను చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసిన రాజగోపాల్ రెడ్డి

Advertisement

Next Story

Most Viewed