PAN Card : 11.5 కోట్ల పాన్ కార్డులు డీ యాక్టివ్.. ఎందుకంటే..?

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-10 08:24:16.0  )
PAN Card : 11.5 కోట్ల పాన్ కార్డులు డీ యాక్టివ్.. ఎందుకంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా 11.5 కోట్ల పాన్ కార్డులు డీ యాక్టివ్ అయ్యాయి. నిర్దేశిత గడువులోగా ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేయని కారణంగా పాన్ కార్డులను డీయాక్టివ్ చేసినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 70.24 కోట్ల పాన్ కార్డు హోల్డర్లు ఉండగా.. అందులో 57.25 కోట్ల మంది పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకున్నట్లు బోర్డు తెలిపింది. మొత్తం 12 కోట్ల మంది పాన్ కార్డు దారులు ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేయకపోవడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.

2017 జులై 1 కంటే ముందు ఇష్యూ చేసిన పాన్ కార్డులను ఆధార్ తో లింక్ చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందరూ ఈ ప్రక్రియను పూర్తి చేసుకునేలా పలుమార్లు గడువును సీబీడీటీ పెంచింది. ఇక, డీయాక్టివేట్ అయిన కార్డులను పునరుద్ధరించడానికి సీబీడీటీ చాన్స్ ఇవ్వనుంది. ఇందుకోసం రూ.వెయ్యి పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. 2023 జూన్ 30 గడువును మిస్ అయిన వారు పెనాల్టీ చెల్లించి మళ్లీ కార్డు పొందవచ్చు. కాగా.. పాన్ కార్డును తిరిగి పొందేందుకు 30 రోజుల సమయం పట్టనుంది.

Advertisement

Next Story

Most Viewed