తెలంగాణలో 11 మంది ఐఏఎస్‌ అధికారులు బదిలీ

by GSrikanth |
తెలంగాణలో 11 మంది ఐఏఎస్‌ అధికారులు బదిలీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో 11 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పురపాలక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్‌ను విపత్తు నిర్వహణ శాఖకు బదిలీ చేశారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్‌‌కు హెచ్‌ఎండీఏ, సీడీఎంఏ కమిషనర్‌గా, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంకు కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌గా, అటవీ, పర్యావరణశాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్‌కు ఈపీటీఆర్ఐ డైరెక్టర్‌ జనరల్‌గా, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శిగా కే.ఎస్ శ్రీనివాస రాజు, జీఏడీ కార్యదర్శి రాహుల్ బొజ్జకు ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శిగా, వైద్యారోగ్య కార్యదర్శిగా క్రిస్టినా, జలమండలి ఎండీగా సుదర్శన్ రెడ్డి, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌గా టీకే శ్రీదేవీ, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి కురుణ, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్‌గా ఆర్వీ కర్ణణ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Next Story