కాంగ్రెస్ లోకి మేయర్‌తో పాటు మరో 10 మంది కార్పోరేటర్లు?

by Ramesh Goud |   ( Updated:2024-03-22 14:36:05.0  )
కాంగ్రెస్ లోకి మేయర్‌తో పాటు మరో 10 మంది కార్పోరేటర్లు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నుంచి అధికార పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తొంది. దీనికి సంబందించి ఇవ్వాళ ఉదయం కాంగ్రెస్ పెద్దలతో జరిగిన సమావేశం అనంతరం చేరికపై మేయర్ స్పందిస్తూ.. కాంగ్రెస్ లోకి ఆహ్వానించారని, చేరికపై కార్యకర్తలతో చర్చించాక నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. దీంతో చర్చలు సఫలం అయ్యాయని తెలుస్తొంది.

అయితే ఆమెతో పాటు మరో 10 మంది కార్పోరేటర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మేయర్‌తో పాటే వీరి చేరికకు కూడా కాంగ్రెస్ కసరత్తులు పూర్తి చేసిందని తెలుస్తొంది. వీరంతా రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే దానం నాగేందర్ సహా గ్రేటర్ పరిధిలోని కొందరు నేతలు పార్టీని వీడగా.. ఇప్పుడు వీరి చేరికతో హైదరాబాద్ పరిధిలో పార్టీకి పట్టు లేకుండా పోతుందేమోనని బీఆర్ఎస్ నేతలు ఆందోళనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Advertisement

Next Story