- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గీత కార్మికుల సంక్షేమానికి పాటుపడాలి
దిశ, తెలంగాణ బ్యూరో: గీత కార్మికుల సంక్షేమానికి నిరంతరం పాటుపడాలని, ప్రభుత్వం కల్పిస్తున్న రుణాలు అందేలా చూడాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. సోమవారం శాసనమండలి ప్రాంగణంలోని చైర్మన్ చాంబర్‌లో గీత కార్మికుల ఆర్ధిక సహకార కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ.. కుల వృత్తులకు పునర్ వైభవం తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
రుణాలు, రాయితీలు ఇస్తూ వృత్తుల బలోపేతానికి చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. గీతకార్మికులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం తాటి మొదలుపన్ను రద్దు, రూ.5లక్షలకు బీమా పెంపు, నీరా కేఫ్, కల్లుదుకాణాలను తెరిపించి ఉపాధి కల్పనకు చర్యలు చేపట్టిందన్నారు. వైన్స్ షాపుల్లో గౌడ్ లకు రిజర్వేషన్ సైతం అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.