యాపిల్ ల్యాప్‌టాప్ బుక్ చేస్తే.. పేపర్ల కట్ట పంపించారు

by Sathputhe Rajesh |   ( Updated:2022-03-30 07:05:37.0  )
యాపిల్ ల్యాప్‌టాప్ బుక్ చేస్తే.. పేపర్ల కట్ట పంపించారు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆన్‌లైన్ షాపింగ్ చేసేందుకు ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతి వస్తువు ఆన్లైన్ లో అందుబాటులో ఉంటుండటంతో ఇంటి నుంచే ఆర్డర్ చేసేస్తున్నారు. అయితే, కొందరు ఆన్ లైన్‌లో షాపింగ్ చేస్తూ మోసపోతున్న ఘటనలు చూస్తున్నాం. అయితే, ఇలా మోసపోయినా.. కంప్లైంట్ ఇచ్చేందుకు వినియోగదారులు ప్రాడక్టును తెరిచే ముందు వీడియోలు తీస్తూ జాగ్రత్తలు పడుతున్నారు. తాజాగా, హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి అమెజాన్ షాపింగ్ సైట్ లో కొనుగోలు చేసి మోసపోయాడు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని కూకట్‌పల్లికి చెందిన యశ్వంత్ తనకెంతో ఇష్టమైన యాపిల్ మ్యాక్‌బుక్‌ను కొనేందుకు అమెజాన్ షాపింగ్ సైట్‌లో రూ.1,05,000 చెల్లించి బుక్ చేశాడు. మంగళవారం అతడికి అమెజాన్ నుంచి పార్శిల్ రావడంతో.. ముందుగానే అప్రమత్తమైన యువకుడు వీడియో తీస్తూ పార్సిల్ ఓపెన్ చేశాడు. అయితే, యువకుడు అనుమానించినట్లే.. పార్శిల్‌లో మ్యాక్‌బుక్‌కి బదులు కాగితాల కట్ట వచ్చింది. ఒక్కసారిగా కంగుతిన్న యువకుడు ఆ వీడియోను అమెజాన్ సీఈవోకు, ఇతర ప్రతినిధులకు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. అయితే, అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story