ఇంత దిగజారుడా.. ఎమ్మెల్యే రాజయ్యపై మహిళలు ఆగ్రహం

by Shyam |   ( Updated:2021-10-03 02:25:35.0  )
Telangana womens
X

దిశ, రఘునాథపల్లి: బతుకమ్మ చీరల పంపిణీ సందర్భంగా స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మహిళలను ఉద్దేశించి మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం అయ్యవారి గూడెంలో మహిళలు ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేశారు. ఒక బాధ్యతగల ఎమ్మెల్యేగా ఉండి.. ఇంతగా దిగజారి మాట్లాడడం సరైంది కాదని, వెంటనే భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలు దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుండగా, వారికి స్థానిక యువతీ యువకులు తోడుగా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని పలు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story