విద్యుత్ ఉద్యోగులకు పెరిగిన డి.ఏ

by Shyam |
విద్యుత్ ఉద్యోగులకు పెరిగిన డి.ఏ
X

రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు 4.02% మేర ట్రాన్స్ కో కరువుభత్యం పెంచింది. పింఛనుదార్లకు కూడా ఇది వర్తించనుంది. ఇప్పటివరకూ విద్యుత్ ఉద్యోగులు వారి మూల వేతనంలో 8.866% మేర కరువుభత్యం అందుకుంటున్నారు. సవరించిన లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి నెల నుంచి అదనంగా 4.02% మేర అందుకోనున్నారు. అంటే మొత్తం 12.886% మేర అందుకుంటారు. ఏప్రిల్ నెలలో అందుకోబోయే వేతనంతో పాటు జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించిన సవరించిన కరువుభత్యాన్ని నగదు రూపంలో అందుకోనున్నట్లు ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. అంతకుముందు గతేడాది జూలై నెలలో కరువుభత్యం రేట్లను ట్రాన్స్‌కో ఖరారు చేయగా ఇప్పుడు మరో 4.02% పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వేతన సవరణ, తాత్కాలిక భృతి, ఢి.ఏ. తదితరాల కోసం ఎదురుచూస్తుండగా ప్రభుత్వం మాత్రం ఉత్తర్వులు జారీ చేయలేదు. కానీ విద్యుత్ ఉద్యోగులకు మాత్రం కేవలం ఏడు నెలల వ్యవధిలో 4.02% మేర డి.ఏ. పెంచడం గమనార్హం.

Advertisement

Next Story