- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీహార్, యూపీకి పోటీగా తెలంగాణ :కొండా విశ్వేశ్వర్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తలవంచి క్షమాపణలు చెప్పాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గురువారం ఢిల్లీ నుంచి ఒక ప్రకటనలో తెలిపారు. స్వరాష్ట్రం సాధించిందే.. నీళ్లు, నిధులు, నియామకాల కోసమని ఆయన తెలిపారు. పక్క రాష్ట్రం ఏపీతో గొడవల కారణంగా ఉన్న నీళ్లు కూడా వారు తరలించుకుపోయారన్నారు. ప్రజలపై పన్ను భారం పెంచుతున్నారే తప్పా ఉద్యోగాలు మాత్రం కల్పించడం లేదన్నారు.
ఢిల్లీ తెలంగాణ భవన్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగుల నియమకాల్లో 74 మందిలో కేవలం నలుగురు మాత్రమే తెలంగాణకు చెందిన వారు ఉన్నారని, అలాంటప్పుడు తెలంగాణ వచ్చి ఏం లాభమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ సమస్య ఎక్కడో బీహార్, యూపీలో ఉండేదని, అయితే ఈ విషయంలో తెలంగాణ వాటికి పోటీ ఇచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ అని చెప్పిన కేంద్రం ఇప్పుడు 33 శాతం నిరుద్యోగ సమస్య ఉందని చెబుతోందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం తెలంగాణ భవన్ లో నియమించిన కాంట్రాక్ట్ ఉద్యోగుల పీరియడ్ సెప్టెంబర్ లో ముగుస్తోందని, అయితే తర్వాత కూడా వారే కొనసాగితే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.